జర్నలిస్టులకు అండగా టీజేయు ఉంటుందని టిజెయు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం టీజేయు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజేయు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు అని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులకు అండగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ తప్పు చేసిన జర్నలిస్టులకు శిక్ష తప్పదని అనడం స్వాగతిస్తున్నామని, అలాగే నికార్సైన జర్నలిస్టులను దూషించడం తగదని అన్నారు. జర్నలిస్టులు సమాజంలో జరిగే వివక్షత ఎత్తిచూపాలని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, గుడాల శేఖర్ గుప్త, ఎల్లం రాజు, మహేష్, శ్రీనివాస్, సాగర్, సీ హెచ్ సత్యం, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు