మేడిపల్లి : కొండాపూర్, తొంబారావుపేట గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. కొండాపూర్ గ్రామంలో శ్వేతా హాస్పిటల్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ వై రాహుల్ సుమారు 150 మందికి పైగా ఉచితంగా బిపి, షుగర్ పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. తొంబారావుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆర్థోపెటిక్, జనరల్ హాస్పిటల్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయ్ రెడ్డి సుమారు 100 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆర్.ఎం.పీ, పి.ఎం.పి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.