పిఠాపురం : యు. కొత్తపల్లి మండలంలో ఉపాధి పనులను పాడా పీడీ చైత్రవర్షిని బుధవారం పరిశీలించారు. మండల పరిధిలోని రమణక్కపేట, మూలపేట గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న పాఠశాలల ప్రహరీ గోడలను పరిశీలించారు. స్థానిక అధికారులతో పనులు గురించి అడిగి తెలుసుకుని పనులు వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అనంతరం చిత్రాడ గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చైత్ర పరిశీలించి పలు సూచనలు చేశారు.
