సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఓరుగంటి విజయలక్ష్మి పాండును నియమించినట్లు జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు గరినే ఉమామహేశ్వరి శ్రీధర్ తెలిపారు బుధవారం పట్టణంలోని కె ఎస్ అపార్ట్మెంట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో విజయలక్ష్మి నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుండేందుకు కృషి చేయాలన్నారు సేవారంగం, రాజకీయ రంగాలలో సైతం వైశ్య మహిళలు ముందుండాలని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయం పేరుకు పొట్టి శ్రీరాములు పేరును తిరిగి ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆంధ్రకు సంబంధించిన నాయకుల విగ్రహాలు, పేర్లతో ఉన్న వాటిని తొలగించకుండా తెలుగు విశ్వవిద్యాలయానికి గల పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం ఆర్యవైశ్య జాతిని అవమానించడమేనన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునసమీక్షించుకొని పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులను పట్టణానికి చెందిన పలువురు శాలువాలతో బొకేలతో సన్మానించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు పైడిమర్రి నారాయణరావు, పందిరి సత్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగు బండి రమాదేవి, డోగుపర్తి హైమావతి, అత్తులూరి శ్రీదేవి, అర్వపల్లి పద్మావతి ,ఆధారపు పద్మావతి, కామిశెట్టి శోభారాణి, భార్గవి, రాజేశ్వరి, రమా, విజయలక్ష్మి ,స్వాతి ,శ్వేత తదితరులు పాల్గొన్నారు….

previous post