ఈ వి రెడ్డి డిగ్రీ కళాశాల 1999_2002 బి యస్ సి (యం పి సి) పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు కోదాడ లోని గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.పాల్గొన్న 40 మంది విద్యార్థుల లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా,పోలీసు అధికారులు గా,యూనివర్సిటీ అధ్యాపకులు గా,ప్రైవేట్ ఉద్యోగాల్లో పని చేస్తున్నామని తెలిపారు.ఆనాడు ఈ వి రెడ్డి డిగ్రీ కళాశాలలో చదువు నేర్పిన గురువుల వలనే ఉన్నత స్థాయిలో ఉన్నామన్నారు. ముఖ్య అతిథిగా వారికి డిగ్రీ లో గణిత శాస్త్రం బోధించిన మరియు ఈ వి రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ యస్ యస్ రావు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు.ఈ సందర్భంగా యస్ యస్ రావు ను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సతీష్,వీరబాబు,సురేందర్ రెడ్డి,శ్రీనివాస్, సైదా బాబు,ఇంద్ర సేనా రెడ్డి,కల్యాణి,రమ్య,స్వాతి,జ్యోతి, వాణి,రుక్మిణి,అనురాధ,సంధ్య,శ్రీ లక్ష్మీ,కవిత,ఉమ,నఫీజా,నాంచారయ్య, చాంద్,ముత్తు,శోభన్,శ్రీపతి రెడ్డి, నరసింహా చారి,లక్ష్మి నారాయణ,సుధాకర్,వాసుదేవరావు,కిశోర్,విజయ్,మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.