Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్‌గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు సేకరించారు. బెట్టింగ్‌ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు చేశారు. ఆయా బెట్టింగ్‌ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బెట్టింగ్‌ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్‌ వెబ్‌సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో-ఫెన్సింగ్‌ టెక్నాలజీతో టి.జి.సి.ఎస్.బి (TGCSB) చర్యలు తీసుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, తేస్టీ తేజ, కిరణ్‌గౌడ్‌లను పోలీసులు విచారించారు. శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌లను విచారణ కోసం సంప్రదించగా వారి ఫోన్లు స్విచాఫ్‌ వచ్చినట్లు సమాచారం. అలాగే మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందారని, అసలు వారికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ

దక్షిణమధ్య రైల్వే జిఎంకు పౌరసంక్షేమసంఘం వినతి

Dr Suneelkumar Yandra

రేపు విద్యుత్ అంతరాయం* 

TNR NEWS

లస్కర్లకు రెయిన్ కోట్లు అందజేసిన డెల్టా ఛైర్మెన్ మురాలశెట్టి సునీల్

Dr Suneelkumar Yandra

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra