Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : వేసవిలో అధికంగా వుండే గృహవిద్యుత్ వాడకాన్ని సంపద సృష్టికి ఆసరాగా చేసుకుని గృహ విద్యుత్ వినియోగదారులపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు లోడ్  భారాలు మోపడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.  కిలో వాట్ కు రూ.1200లు మించితే రూ.2,450  రెండు కిలో వాట్స్ దాటితే రూ.3,650లు అదనంగా వసూలు చేసేందుకు టార్గెట్స్ పెట్టడం అంట కత్తెర  చోద్యంగా వుందన్నారు.  ట్రూఅప్ తదితర తాడు బొంగరం లేని అదనపు చార్జెస్ పేరిట విద్యుత్ బిల్లులు అధికం కాగా, వేసవి ఎండల్లో కిలో వాట్ టార్గెట్స్  తగదన్నారు. ట్రాన్స్ కో ప్రకటించిన 50శాతం రాయితీ  వేసవికి అడ్వాన్స్డ్ క్షవర కళ్యాణంగా వుంద న్నారు. యూనిట్ రేట్లు ఇప్పటికే అధికంగా వున్నందున అదనపు  భారాలు రెండు కిలో వాట్స్ వరకు గృహ వినియోగదారులపై  లేకుండా రద్దు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

Related posts

ఘనంగా కుక్కుటేశ్వరుడి రథోత్సవం

Dr Suneelkumar Yandra

అడవులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

Dr Suneelkumar Yandra

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

TNR NEWS

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

TNR NEWS

ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం

Dr Suneelkumar Yandra

అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్

TNR NEWS