ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం పదోన్నతుల ప్రక్రియకు వ్యతిరేకంగా అభ్యర్థులు నిరసనకు దిగారు. సీనియర్ ఎస్జీటీ టీచర్లకు 70శాతం మేరా పదోన్నతులు కల్పించడంతో బీఈడి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలాల్లో 30 శాతం మాత్రమే నేరుగా భర్తీ చేస్తూ, 70 శాతం ఖాళీలు పదోన్నతులు కల్పిస్తుండం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల మాదిరిగా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ అభ్యర్ధులతోనే నింపుతున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. పదోన్నతుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులు రాంబాబు, శ్రీను, సందీప్, నరేష్, శోభ, సారిక, సుమ, తులసి, రమేష్ శ్రీరాములు, శ్రీకాంత్, రామారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.