ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెంటనే అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు.మంగళవారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. జనాభా దామాషా ప్రకారం అధిక శాతం ఉన్న మాదిగలు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ వెంటనే చేపట్టాలని నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. ఎస్సీ లో ఉన్న 59 ఉప కులాలకు న్యాయం చేయాలని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కోదాడ డివిజన్ అధ్యక్షుడు నందిగామ ఆనంద్,ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు,నందిపాటి రవి తదితరులు పాల్గొన్నారు……..