జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలలో మునగాల లోని సాయి గాయత్రి విద్యాలయలో ఐదవ తరగతి చదువుతున్న తంగేళ్ళగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి జెస్సికా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీటును కైవసం చేసుకుంది ఈ సందర్భంగా పాఠశాల చైర్ పర్సన్ ఉషారాణి ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ ఏవో ప్రభాకర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అ విద్యార్థినిని అభినందించారు ఈ సందర్భంగా శంకర్ సార్ మాట్లాడుతూ… ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరెన్నో సాధించే సత్తా ఉన్న పాఠశాల సాయి గాయత్రి విద్యాలయ అని తెలియజేశారు మా పాఠశాల కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యను అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ తో నడిచే పాఠశాల అని మట్టిలో మాణిక్యాల వెలికి తీసే సత్తా ఉన్న విద్యా సంస్థను ఈ సంస్థను విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మరింత నైపుణ్యాన్ని విద్యార్థులకు అందజేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు మొలుగురి లక్ష్మణ్, భవాని లు పాఠశాల యాజమాన్యానికి అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
