November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఏప్రియల్ 1 నుండి ప్రతి పేదవారికి పోషకాలతో కూడిన నాణ్యమైన 6 కేజీల సన్న బియ్యం

రేషన్ షాప్ లలో మామిడి తోరణాలు,పూల దండలు కట్టి పండుగ వాతావరణం లో సన్నబియ్యం పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సన్న బియ్యం పంపిణి గురించి రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఏప్రియల్ 1 నుండి ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి చేయాలని సూచించారు.

 

సూర్యాపేట రైతులు పండించిన పంట మిల్లులో మర ఆడించి సన్నబియ్యం ను సూర్యాపేట పేదలకి పంపిణి చేయటం చాలా సంతోషంగా ఉందని గతంలో తినడానికి ఆహారం లేక ఇతర దేశాల నుండి మనం ధాన్యాలు దిగుమతి చేసుకున్నాం కానీ నేడు మన జిల్లా నుండి 10 నుండి 15 రకాల సన్న దొడ్డు రకం వడ్లను పండించి ఇతర జిల్లాలకి, రాష్ట్రాలకి ఎగుమతి చేసే స్థాయి కి ఎదిగామని ఇది విప్లవాత్మక మార్పు అని కలెక్టర్ అన్నారు.

 

దొడ్డుబియ్యం చాలా మంది తినకుండా వివిధ మార్గాలలో దుర్వినియోగం అయినాయని

తెలంగాణలో ప్రజలు సన్నబియ్యం ఎక్కువ తింటారు కాబట్టి ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణి చేసి ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం ఇస్తుందని ఎట్టి పరిస్థితిల్లో సన్నబియ్యం స్థానం లో దొడ్డుబియ్యం ఇవ్వకూడదని సన్నబియ్యంలో FRK(పోర్ట్ పైడ్ రైస్ కేర్నల్స్) పోషకాలతో కూడిన గుళికలు ఉంటాయని అవి ప్లాస్టిక్ బియ్యం కావని ప్రజలకి డీలర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ -పాస్ మిషన్ ద్వారా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కేజీ ల చొప్పున ఉచితంగా పంపిణి చేయాలని, తూకంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని అన్నారు.ఏప్రియల్ 1 వ తేదీనాడు జిల్లాలోని 610 షాప్ లు తప్పకుండా ఉదయం 8 గంటల నుండి బియ్యం పంపిణి ప్రారంభించాలని జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఏర్పాట్లు చేసుకోవాలని రేషన్ షాప్ లను సివిల్ సప్లై అధికారులు పరిశీలించాలని, e పాస్ మిషన్ లో ఏమైనా సమస్య ఏర్పడితే పై అధికారులకి తెలియపర్చాలని అన్నారు.

 

తదుపరి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానం లో సన్న బియ్యం పంపిణి చేస్తుందని, అన్ని దానాలలో అన్నదానం గొప్పది కాబట్టి పేదవాడి ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణి మహోత్మక కార్యక్రమంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించి ఎలాంటి సమస్య లేకుండా పేదలకు బియ్యం పంపిణి చేయాలని ఏప్రియల్ 1 నుండి 15 వ తారీఖు వరకు ఉదయం 8 నుండి 11 వరకు సాయంత్రం 5 నుండి 8 వరకు సమయపాలన పాటిస్తూ వందశాతం పంపిణి చేయాలని తెలిపారు. సన్నబియ్యం లో ఎలాంటి అవకతవకలు జరిగితే డిపార్ట్మెంటల్ చర్యలతో పాటు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.రేషన్ షాప్ లను తహసీల్దార్ లు, డి టి లు,విజిలెన్స్ అధికారులు, టాస్క్ పోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ లు చేస్తారని తెలిపారు.రేషన్ షాప్ లలో ప్రస్తుతం ఉన్న దొడ్డు బియ్యంను కమిషనర్ గారి తదుపరి సూచనలు వచ్చేంత వరకు భద్రపర్చాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో డి ఎస్ ఓ రాజేశ్వర్, డి ఎం ప్రసాద్, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ లు, డి టి లు, రేషన్ డీలర్ల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నా

 

 

Related posts

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక  శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

TNR NEWS

లక్షడప్పుకులు వేలగొంతుల మహాసభవాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.జిల్లానాయకులు

Harish Hs

TNR NEWS

రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే

Harish Hs

శ్రీకాంత్ చారి ఆశయాలను సాధించాలి 

TNR NEWS

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS