December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 

కల్లు గీత కార్మికుల సంక్షేమ కోసం ఏర్పడిన టాడి కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు మెరుపరచాలని *కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* అన్నారు. ఈరోజు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల (ఎం వి ఎన్) భవనములో *జిల్లా అధ్యక్షులు ఏలుగూరి గోవిందు* అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగినది. దీనికి ముఖ్యఅతిథిగా *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాము.

రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది కాళ్లు చేతులు విరగడం, నడుము పడిపోవడం, చనిపోవడం జరుగుతుంది. సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారి పడుతున్నారు వీరిలో 180 మంది చనిపోతున్నారు. అంటే సరాసరి రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు. ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. అయినా బతుకుతేరువు కోసo వృత్తి ప్రమాదమైనప్పటికి చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్టులను కల్లుగీత వృత్తి చేసే వారందరికీ పంపిణీ చేయాలని రీయల్ ఎస్టేట్ వ్యాపారం పెరగి భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారు. రోజు రోజుకు వనాలు తరిగిపోతున్నాయి. లిక్కర్, బెల్టు ఫాపుల శీతల పానీయాల వలన ప్రజల ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ ప్రభుత్వాలు నియంత్రించడం లేదు వాటి వలన కల్లు అమ్మకాలు పడిపోతున్నాయి. ప్రకృతి పానీయమైన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కల్లుకు మార్కెట్ లేదు ప్రభుత్వాలు ప్రచారం చేయడం లేదు

 

1991 లో కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కల్లుగీత పారిశ్రామిక సహకార ఆర్దిక సంస్త ఏర్పాటయ్యింది. గీత కార్మిలకు రుణాలు ఇవ్వడం, నీరా తాటి ఈత ఉత్పత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు, నందనం లో 5 ఎకరాల భూమి కొనుగోలు తదితర కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వాలు మారడం వలన తగిన శ్రద్ద చూపక పోవడంతో ఈ కార్పొరేషన్ క్రమంగా నిర్విర్యం అయ్యింది .2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా దీనికి తగిన బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. దీని ద్వారా ఎలాంటి పథకాలు అమలు కాలేదు. దీని లక్ష్యం గీత కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, మారుతున్న కాలానికి అనుగునంగా వృత్తిలో అధునీకరణ తీసుకరావడం. కాని అది నేటికి నెరవేరలేదు. గత ప్రభుత్వం నక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. దీనిని టూరిజం శాఖ నిర్వహిస్తుంది.టాడి కార్పొరేషన్ ద్వారా నిర్వహించి జిల్లాలకు విస్తరింప చేయాలి.

*ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పన ఎక్స్రేషియా నెల రోజుల లోపు ఇవ్వాలి. మెడికల్ బోర్డు విదానం తొలగించాలి. వృత్తిలో ఎక్కడ ప్రమాదం జరిగినా వర్తింప జేయాలి.

* బెల్టు షాపులను పూర్తిగా నిషేదించాలి. కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి.

గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 5వేలు ఇవ్వాలి.

కల్లుగీత కార్మికులందరికి వృత్తికి ఉపయోగ పడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి.

* ఎజెన్సి ఏరియాలో కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పధకాలు అక్కడి గీత కార్మికులకు వర్తింప చేయాలి అన్నారు.*కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు* మాట్లాడుతూ

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించి టాడి కార్పొరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలి అన్నారు.

ప్రతి సొసైటీకి చెట్ల పెంచడానికి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జివో అమలు చేయాలి. లేదా కొనివ్వాలి.

టిడిపి ప్రభుత్వం హయాంలో కోటి వరాల పథకంలోఇచ్చిన 439 సొసైటీల భూములకు పెన్సింగ్ చేయించాలి. తాటి, ఈత, జీనుగు, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టి చెట్లు నాటాలి.

కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలి. దహన సంస్కారాల కొరకు 50,000లు, గాయాలైన వారికి వైద్య ఖర్చుల కొరకు 25,000లు ఇవ్వాలి.

నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. గౌడ యువతీ యువకులకు ఉపాది కల్పించాలి.

తాటి ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్త చట్టం తీసుకరావాలి.

* వేతన గీత కార్మికులకు అసోషియేట్ మెంబర్షిప్ ఇవ్వాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తించ చేయాలి.

ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలి.

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి.

కాగ్రేస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విదంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు అబ్బగాని బిక్షం ఉయ్యాల నగేష్ జేరిపోతుల కృష్ణ బట్టిపెల్లి నాగమల్లయ్య మండవ సైదులు అబ్బగాని కాశయ్య దోనేటి పిచ్చయ్య మట్టపల్లి సిద్దయ్య బెల్లంకొండ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి……

TNR NEWS

గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

TNR NEWS

అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

Harish Hs