ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కోదాడ ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థిని షేక్ జాస్మిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆరవ తరగతిలో ప్రవేశానికై అర్హత సాధించింది. కాగా గురువారం పాఠశాల ఆవరణలో సీటు సాధించిన విద్యార్థితోపాటు తల్లిదండ్రుల ను అభినందిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ కోటి సీతాలక్ష్మి, డైరెక్టర్ వేదంతరావు ఉపాధ్యాయనిలు ఘనంగా సన్మానించారు. గతంలో కూడా కోదాడలోని తమ పాఠశాలలు శ్రీ స్కూల్, ఎలైట్ క్రియేటివ్ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు నవోదయ, సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకై సీట్లు సాధించారని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు……..

previous post