ఇదే నిజం బొల్లారం : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 100116 రూపాయల విరాళాన్ని.. అలాగే నల్లవల్లి గ్రామ పరిధిలోని పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి 10116 రూపాయల విరాళాన్ని చెక్కుల రూపంగా అందజేశారు. దేవాలయాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు శంకర్ యాదవ్, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి, వాసుదేవారెడ్డి, సూర్యనారాయణ, నల్తూరు యాదగిరి, ఎల్లయ్య, బిక్షపతి, విష్ణువర్ధన్ ఆయా గ్రామాల దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.