వివిధ రకాల డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా యువత పని చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అన్నారు. డ్రగ్స్ వాడకం, ఆక్రమణ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి కోదాడ గాంధీ నగర్ లో నిర్వహించిన లీగల్ అవేర్ నెస్ పోగ్రాంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ ,గంజాయి సేవించడం,రవాణా చేయడం, కలిగి ఉండడం నేరం అన్నారు.ఈ మధ్యకాలంలో యువత మత్తు మందులకు బానిసలు గా మారి బంగారు భవిష్యత్తు ను పాడుచేసుకుంటున్నారన్నారు.మాదకద్రవ్యాలు వినియోగం వలన సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని,మానవ విలువలు మంటగలిసిపోతున్నాయన్నారు.మాదకద్రవ్యాల వలన జరుగుతున్న అనర్థాలను ప్రజలు అర్ధం చేసుకుని,వాటికి దూరంగా ఉండాలన్నారు.మత్తును వదిలినప్పుడే మనిషి బాగుపడతాదన్నారు.మాదకద్రవ్యాల నిరోధక చట్టం ద్వారా శిక్షలు వుంటాయని,అందరూ చట్టపరంగా నడుచుకోవాలని, ప్రజలంతా చైతన్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 1వ,2వ అదనపు న్యాయమూర్తులు md. ఉమర్, సయ్యద్ జకీయా సుల్తానా, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, అడిషనల్ పి.పి.సిలివేరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు గట్ల నర్సింహారావు, ఈదుల కృష్ణయ్య, వెంకటాచలం,హుస్సేన్, పాషా,మిర్యాల మంగయ్య, దావీదు,మంద వెంకటేశ్వర్లు,స్థానికులు నాగరాజు,పాండు,చింతబాబు,రమేష్,మండల లీగల్ సర్వీసు సిబ్బంది,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.