రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అడ్డం పెట్టుకొని గొడవలకు దిగవద్దని శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ప్రజల రక్షణ, సెన్సాఫ్ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు. ఆన్లైన్ మోసాల బారిన ఎవరు కూడా పడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 సైబర్ సెల్ జాతీయ ప్లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. గ్రామంలో ఎవరు కూడా బెల్ట్ షాప్ నడపవద్దని సూచించారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.