నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని పేదిరిపాడ్ గ్రామంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ పునస్కరించుకొని ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భారత్ కుమార్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ హాజరై మాట్లాడారు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఉగాది రోజు ప్రతికించి ప్రతి ఇంట్లో షడ్రుచులతో కూడిన ఈ పచ్చడిని చేసుకొని అందరు సేవిస్తూ ఉంటారు ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అన్ని రుచులు మరి అలాగే స్వచ్ఛంగా మన ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పచ్చడి కాబట్టి దీనిని యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో పంచుతూ ఈ సందర్భంగా ఈ ఉగాదికి ఈ షడ్రుచుల్లా మనమందరం కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలని మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మనం కూడా ఈ పచ్చడి లాగా సుఖ సంతోషాలతో ఐక్యమత్యంతో కలిసి ఉండాలని కోరుతూ ఈ ఉగాది పండుగ సందర్భంగా బయట దొరికే కూల్డ్రింక్స్ ను మానేద్దాం సహజమైన పానీయాలు సేవిద్దామని నినాదాలు ఇచ్చారు బయట దొరికేటటువంటి అనేకమైనటువంటి కూల్డ్రింక్స్ వలన ఆరోగ్యాలు పాడైపోయి చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఈ వేసవికాలంలో చాలా ఎక్కువ మంది ఈ కూల్డ్రింక్స్ ని సేవిస్తా ఉన్నారు కాబట్టి ఈ కూల్డ్రింక్స్ వల్ల అనేకమైనటువంటి అనారోగ్య కారణాలు వస్తున్న సందర్భంలో వీటిని మానేసి సహజంగా దొరికేటటువంటి పానీయాలు తాగాలని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో నర్సింహ, వెంకట్రాములు, అంజి, సుక్కప్ప, వెంకట్, శంకర్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.