కోదాడ చెరువు కట్టపై ఉన్న కంపచెట్లను తొలగించి ఉదయాన్నే వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. గురువారం చెరువు కట్టపై కంప చెట్లు మొలిచి ఇబ్బందిగా మారడంతో ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావులు కమిషనర్ రమాదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో వెళ్లి పరిశీలించారు. కోదాడ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు ఉదయం తెల్లవారుజామునే పాఠశాల ప్రారంభిస్తున్నందున వ్యాయామం చేసేందుకు ఎక్కడ కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాయామం చేసే వారికి కోదాడ చెరువు కట్ట ఎంతో ఆహ్లాద భరితంగా ఉంటుందని ఉదయాన్నే సూర్యరష్మి తో పాటు చెరువు అందాలకు వాకింగ్, సైక్లింగ్ చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ రమాదేవి వీలైనంత తొందరగా మున్సిపల్ సిబ్బందితో పిచ్చి చెట్లు, కంపచెట్లను తొలగించి చెరువు కట్టను శుభ్రం చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు…….

previous post