కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో నిర్మించిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ ఆవిష్కరణలో సబ్బండ వర్గాల ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మాజీ సర్పంచ్ పార సీతయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన కులాల ప్రముఖులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేయడంతో పాటు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పూలే అని అటువంటి గొప్ప నాయకుడి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు ఆ మహా నాయకుడికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ తేదీ కార్యక్రమం విజయవంతం కావడంలో నాయకుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికిపూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్యనారాయణ,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, బంగారు నాగమణి, ఈదుల కృష్ణయ్య, చింతాబాబు, ఏపూరి రాజు,చింతలపాటి శ్రీనివాసరావు, భాష బోయిన భాస్కర్, షమీ,బాగ్దాద్,డాక్టర్ బ్రహ్మం, మదీనా మీర, గంధం పాండు,సంగిశెట్టి గోపాల్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు……..