- చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం
- జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ
చోడవరం : రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ వలన కలుగుతున్న తీవ్ర ఇబ్బందులను, క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్య నుండి అనధికారిక రహదారి నిర్మించడం వలన రైతుల పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని, అందుచేత రెవిన్యూ మరియు నీటి పారుదల శాఖలతో విచారణ చెయ్యాలని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు వ్యక్తిగతంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌కు చేసిన ఫిర్యాదుతో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ నందు క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు అవకతవకలను గుర్తించిన అధికారులు మరింత లోతుగా విచారణ చెయ్యడానికి రెవెన్యు శాఖ అధికారులను కూడా రమ్మని కోరుతూ ఈ విచారణను ఈ నెల 17వ తేదీ చేపడతామని లిఖిత పూర్వకంగా తెలియ చేసారు. ఈ విచారణ నందు పి.వి.ఎస్.ఎన్.రాజు ప్రతినిధిగా బుంగా కోటిబాబు , స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.