- ఆలయ సహాయ కమీషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్
పిఠాపురం : ఎండలు ఎక్కువుగా వుండడంతో ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వారి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పాదగయా క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. ఈ చలివేంద్రంలో మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆలయ ఆవరణలో చలువపందిర్లు ఏర్పాటు చేశామన్నారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆలయం కావడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలియజేశారు. వేసవి కాలం ముగిసేవరకు ఈ చలివేంద్రం కొనసాగిస్తామన్నారు.