వికారాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లో బాగంగా 300 గృహాలకు మార్కింగ్ చేయగా ,అందులో 25 మంది లబ్ది దారులు ఈ రోజు వరకు బెష్ మెంట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
మంగళవారము శంషాబాద్ నోవాటేల్ హోటల్ నందు గౌరవ రాష్ర ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా ఎంపికైన లబ్ది దారులకు బెష్మేంట్ నిర్మాణానికై ఒక లక్ష రూపాయల చొప్పున ఇద్దరు లబ్ది దారులకు రెండు లక్షల చెక్ లు అంధ జేయడం జరిగిందని తెలిపారు. మిగతా లబ్ది దారులకు అందరికి ఆన్లైన్ ద్వార చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.
1. నూర్జహాన్ బేగం , సంగాయి పల్లి గ్రామం, దుద్యాల మండలం, కోడంగల్ నియోజకవర్గం.
2. మాల లక్ష్మి, ఎంకే పల్లి గ్రామం, పూడూర్ మండలం, పరిగి నియోజకవర్గం.
ఈ కార్యక్రమం లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాదికారులు, పి డి హౌసింగ్ ఏ. కృష్ణయ్య తదితరులు ఉన్నారు.