జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు. సురతాని భాగ్యలక్ష్మి-మల్లారెడ్డి గార్ల పుత్రుడు సురతాని అరవింద్ రెడ్డి. ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలవడంతో తల్లిదండ్రులు అరవింద్ రెడ్డిని చూసి గర్వపడుతున్నారు. మండలానికి చెందిన నాయకులు ప్రశంసించారు.