Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు గంధం సైదులు తాసిల్దార్ను కోరారు. బుధవారం మండల కేంద్రంలో గతంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పోసుకున్న ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ ఆంజనేయులు కు వినతిపత్రం అందజేశారు కొన్ని రోజులుగా వరి పంట నూర్పిడి చేసిన రైతులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మద్దతు లభిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు అన్నారు. మునగాల నారాయణ గూడెం కృష్ణానగర్, గణపవరం, తిమ్మారెడ్డి గూడెం, కొక్కిరేణి గ్రామాలకు కొంతమంది రైతులు 10, 15 రోజుల నుంచి నూర్పిడి చేసిన ధాన్యాన్ని మండల కేంద్రంలో తీసుకువచ్చి ఆరబెట్టుకున్నారన్నారు ఇప్పటికే 60, 70% రైతులు వరి నువ్వు ఇప్పుడు చేయించి ధాన్యం అమ్ముకోనందుకు సిద్ధం చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ఆఫీసర్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రోజు వస్తున్న మబ్బులు వర్షాలతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చోట రైతుల ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయిందని తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత ఆఫీసర్లు తక్షణమే స్పందించి మునగాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

రైతుల శ్రేయస్సు దృష్ట్యా…

గంధం సైదులు

మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యక,ర్త మునగాల

Related posts

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు మల్లికార్జున్ కరిగే దిష్టిబొమ్మ దహనం

TNR NEWS

డిజేఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS