కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి సూర్యాపేట,నల్లగొండ జిల్లాలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోదాడ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలు తో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు. ఆలయ చైర్మన్ జూకూరి అంజయ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు.