రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం అర్హులైన రైతులకు నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా రైతుల పక్షాన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పిఎసిఎస్ పరిధిలోని 154 మంది రైతులు తీసుకున్న 92 లక్షలు మాఫీ చేసిన సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. రెండు లక్షల పైన తీసుకున్న రుణాలు ఇంకా అనేక కారణాల చేత మిగిలి ఉన్న రైతుల రుణాలు కూడా త్వరలోనే మాఫీ అవుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరి రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు……..

previous post