Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్

అరకొర తనిఖీలు… మామూళ్ల మత్తులో అధికారులు

 

పిఠాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయించవద్దని పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ బాలకార్మికులతో పని చేయిస్తున్న తీరు ప్రజలను ఆశ్చర్యం కలిగించింది. అభివృద్ధిలో దేశంలోనే పిఠాపురం నియోజవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. అధికారుల నిర్లక్ష్య ధోరణి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. పిఠాపురం మెయిన్ సెంటర్ ఉప్పాడ బస్టాండ్ వద్ద రోడ్డు కానుకుని చిన్నమాంబ మున్సిపల్ మున్సిపల్ పార్క్ గోడకు చేసి ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద బాల కార్మికులు పనిచేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. అరకొర తనిఖీలు నిర్వహిస్తూ మామూళ్ల మత్తులో అధికారులు వ్యవహరిస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చక్కగా స్కూల్ కెళ్ళి చదివి బంగారు భవిష్యత్తుని చక్కదిద్దుకోవలసిన భవిష్యత్తుని బాల కార్మికులుగా మారి తమ బాల్యాన్ని తమ భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే…!

Related posts

జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!

TNR NEWS

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు

త్రిపుర సుందరి కోనేరును స్వర్ణాంధ్ర పార్కుగా ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి

Dr Suneelkumar Yandra

పాదగయా క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తాం – ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్

Dr Suneelkumar Yandra