Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ

  • జనసేన తీర్థం పుచ్చుకున్న 13 మంది వైసీపీ కాన్సిలర్లు

 

నిడదవోలు : జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చోటు దక్కించుకుంది. 13 మంది వైసీపీ కాన్సిలర్లు, టీడీపీ, ఎక్స్ అఫీషియోతో కలిపి జనసేన తీర్థం పుచ్చుకు న్నారు. దీంతో జనసేన బలం15కు చేరింది. ఏప్రిల్ 3న ఛైర్మెన్ పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీవో మరియు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అయితే ఇంతలోనే మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. దీంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం సరిపడక అవిశ్వాస తీర్మానం వీగింది. జనసేన పార్టీకి తగిన బలం చేకూరడంతో నిడదవోలు మున్సిపాలిటీ తోలి జనసేన మున్సిపాలిటీగా జనసేన ఖాతాలో చేరింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలం మరియు నిదడవోలు ఎమెల్యే కందుల దుర్గేష్ సారథ్యంలో జరుగుతున్న నిడదవోలు అభివృద్ధి పనులు నచ్చి, మాపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లకు నిదడవోలు ఎమెల్యే, పర్యాటక శాఖా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related posts

గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు

Dr Suneelkumar Yandra

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన

Dr Suneelkumar Yandra

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర

నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి

Dr Suneelkumar Yandra

ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలు

Dr Suneelkumar Yandra