Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

నిగూఢ నిర్ణయం – విజయానికి తొలి పదం

ఆలోచన స్థిరంగా ఉంటే విజయాన్ని చూడటానికి ఎంతో కాలం పట్టదు, అదే ఆలోచన మారుతూ ఉంటే నువ్వు ఎంత కష్టపడినా విజయాన్ని చూడటానికి సమయం పడుతుంది, కష్టాన్ని నమ్ముకుంటే గొప్పగా బ్రతకొచ్చు, సరదాలకు అలవాటు పడితే ఏ క్షణాన జీవితం కూలిపోతుందో చెప్పలేం, తీసుకుని నిర్ణయాలు స్వచ్ఛంగా, జీవితాన్ని మార్చుకునే విధంగా ఉంటే ఆ ప్రకృతి సైతం నీ నిర్ణయానికి అడ్డు రాకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది.

 

అలాంటి అక్షరాలు పురుడు పోసుకున్నది మన కవయత్రి మామిడాల శశిరేఖ గారి కలం నుండి, అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు, అడిగి మరి ఆప్తుల కడుపు నింపుతుంది, ఆమె యోచనలే కాదు ఆమె కూడా ఎవరికి అందనంత స్థాయిలో నిలబడింది, అదంతా కూడా ఆమె కష్టం మాత్రమే, అలాగే ఆమె రచనలు చదివే పాఠకుల మనసులకు ఎంతో ఉత్తేజాన్నీ ఇస్తుంది, సమాజం కోసం మనం కూడా పోరాడాలి అనే సంకల్పాన్ని మనలో పుట్టేలా చేస్తుంది, భావితరాల కోసం, మకిలి పడుతున్న సంస్కృతి సంప్రదాయాల కోసం, సమాజ మార్పు కోసం హితబోధ చేస్తూ, అనుక్షణం తనని తాను మార్చుకుంటూ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూనే ఉంటుంది, ఆమె మాటలు ఎగసే అగ్నిశిఖలులా ఉన్నా ఆమె మనసు వెన్నెలా సున్నితంగా ఉంటుంది,ఆమె రచనలలోవెన్నెల వెలుగులు  ప్రకాశిస్తూనే ఉంటాయి.

 

ఇక కవిత్వం విషయానికి వస్తే

******

నిర్ణయం

****

మనసుతో చేసే సంఘర్షణ

మెదడులో మౌనంగా మండే అగ్నిగుండం

వేవేల ఆలోచన అలజడి

కొన్నింట్లో సభబెనని సందడి చేస్తూ

కొన్నింట్లో వద్దని వారిస్తూ

శూన్యంలోకి శతవిధాలా వెతికేది…

 

శతకోటి పరిస్థితుల పునాది

అవకాశమై చేయందించేది

ఆవేదనై ఆమడ దూరం పోయేది

సలహాకై సన్నిహితులతో సమాలోచన చేసేది

స్నేహితుల సహాయాన్ని కోరేది…

 

ఆశావిహంగమై విహరించేది

అదృష్టమై అందలాన్నే ఎక్కించేది

ఆదర్శమై నిలబెట్టేది

నిప్పుగా మారి నిన్ను నిలువునా దహించేది

ఉప్పెనల ఉపద్రవమై నిన్ను ముంచేసేది

నిన్ను ప్రశ్నింప చేస్తూ సందిగ్ధంలోకి నెట్టేది…

 

తప్పు ఒప్పు అంటూ తలనొప్పిగా మారేది

కట్టుబడి ఉంటూ కట్టిపడేసేలా చేసేది

వాడిపోయిన ఆశలను చిగురింప చేసేది

దిక్సూచయై దిశను మార్చేది

సరైన సలహాతో స్వర్గమునే తలపించేది

నిన్ను నీడలా వెంటాడుతూ

నిన్ను నీలా నిలబెట్టేదే నీ నిర్ణయం…

 

రచయిత – మామిడాల శశిరేఖ

******

నిర్ణయానికి తీసుకోడానికి మనసులో జరిగే సంఘర్షణలో వేవేల ఆలోచనలు విజృంభిస్తూనే ఉంటాయి, కొన్ని సరైనవేనని అనిపిస్తే, మరికొన్ని సరైనవి కాదని అనిపిస్తాయి ఏది ఏమైనా నిర్ణయాన్ని తీసుకొని ఇవ్వకుండా శూన్యంలోకి తోసేస్తాయి అంటూ, ఒక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో మనసు ఎంత ఆవేదనకు గురి అవుతుందో ఏ విధంగా సతమతమవుతుందో చాలా చాకచక్యంగా వివరించారు రచయిత…

 

స్నేహితుల సమయాన్ని కోరుతూ, సలహాల కోసం సన్నిహితులతో ఆలోచన చేయించేది, ఆవేదన వస్తే ఆమడ దూరం పోయేదే, అవకాశం చేయండించి శతకోటి పరిస్థితులకు, అవకాశాలకు పునాది వేసేది నిర్ణయమే అంటూ మనం ఒక ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ఆ ప్రకృతి సైతం మనకు సహకరించి సహాయం చేస్తుంది అంటూ తనలోని భావాలను ఎంతో సున్నితంగా బయటపెట్టారు రచయిత….

 

అదే నిర్ణయం ఒక్కోసారి ప్రశ్నలను రేకెత్తించి సందిద్దంలోకి నెట్టేస్తుందని, ఉప్పెనలా ఉపద్రవం చేస్తుందని, నిప్పుల మారి నిలువునా దహించిన ఆలోచించాల్సిన అవసరం లేదని ఎంతో వివరనాత్మకంగా వివరించారు….

 

ఆ నిర్ణయమే ఆశావిహంగమై గగనాన విహరింప చేస్తుందని, అదృష్టంలా మారి అందలాన్ని ఎక్కిస్తుందని ఆదర్శంగా నిలబెడుతుందని, ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో సముచిత ఆలోచనలు ఎదురైనా సరే, విజయానికి మాత్రమే మొగ్గు చూపకుండా అపజయాన్ని కూడా జయించగలగాలి అని ఎంతో వివరంగా సందేశం ఇచ్చారు రచయిత…

 

తప్పొప్పులు అంటూ తలనొప్పిగా మారినా, తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండేలా చేస్తుందని, వాడిపోయిన ఆశలను చిగురింప చేస్తుందని, దిక్సూచి ఇలా మారి దిశను మార్చి, సరైన సలహాలతో స్వర్గాన్ని చూపిస్తుందని, నీడలా వెంటాడుతూ నిన్ను నీలా నిలబెడుతుంది నీ నిర్ణయం అంటూ , ఎంతో చాకచక్యంగా వివరించారు…

 

మనం నిర్ణయం తీసుకున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి, వాటిని మనం ఎలా జయించాలి, వాటితో ఎలా పోరాటం చేయాలి అనేదానిని ఎంతో వివరణాత్మకంగా విశదీకరించి చెప్పారు శశిరేఖ గారు, ఇలాంటి ప్రేరణాత్మకమైన రచనలు మీ కలం నుంచి పునర్జన్మించాలని, మీ రచనలు ఎంతోమందికి ఆసరాగా నిలవాలని, ఆకాశాన్ని మించి మీ అభ్యున్నతి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

 

అలాగే వరంగల్ బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీగా రెండవసారి భారీ మెజారిటీతో గెలిచి మీరెంటో, మీ ఔనత్యం ఏమిటో, మీ నిర్ణయం ఎందరికి ఆదర్శవంతంగా నిలుస్తుందో మీ విజయంతో చెప్పకనే చెప్పారు,

ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా – ఎదిరించి నిలబడ్డారు

ఆశయాన్ని విడవకుండా – ఆకాంక్షతో ముందుకు సాగారు

వెనక్కి లాగాలని ఎంతమంది చూస్తున్నా – మీలో మీరు ధైర్యం నింపుకుని అడుగులు ముందుకు కదుపుతూనే ఉన్నారు

మీ ఆకాంక్ష ఫలించింది, మీ ఆశ నెరవేరింది, అడ్వకేట్ గా మీ పరిణితి ఆకాశాన్ని తాకింది, న్యాయాన్ని ఒక చేత్తో, కవిత్వాన్ని మరో చేత్తో నిలబెడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు….

 

సమీక్షకురాలు : పోలగాని భాను తేజశ్రీ

Related posts

ప్రేమ పరీక్ష

శీర్షిక : పెళ్లి

Dr Suneelkumar Yandra

నాన్నపై కక్ష కట్టిన అక్షరమా!

Dr Suneelkumar Yandra

ఆత్మలింగాత్మకమ్..! అమర లింగా త్మకమ్…!!

Dr Suneelkumar Yandra

జీవరాశుల సమ్మేళనం – జీవకోటికి ఎనలేని నరకం

Dr Suneelkumar Yandra

ఎవరికి చేయాలి సన్మానం..!?

Dr Suneelkumar Yandra