పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కాకినాడ జిల్లా ఆవిర్భావం, ప్రమాణ స్వీకార కార్యక్రమం కాకినాడ వెంకీ రెసిడెన్సిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని శ్రీరామ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన జిల్లా కార్యవర్గం సభ్యులు చే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా పులవర్తి కుమార్, పిఠాపురం ఉపాధ్యక్ష అడ్మినిస్ట్రేటివ్ గా వెలగా వెంకట నగేష్ బాధ్యతలు స్వీకరించారు. కార్యదర్శిగా యక్కల ప్రసాదు, కోశాధికారిగా గ్రంధి దిలీప్ తదితర నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో జోన్ చైర్మన్గా ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బోడ సతీష్ , అడిషనల్ కోశాధికారిగా కే.తాతాజీ, జోన్ కన్వీనర్ గా కుసుమంచి సురేష్, ఒలంట్రీ కమిటీ వైస్ చైర్మన్ కొత్త దేవ జగన్మోహన్రావు, వాణిజ్య విభాగం సెక్రటరీగా చెక్క శోభనాద్రి రావు, యువజన సంఘం వైస్ చైర్మన్ గా రేపాక రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ గా దంగేటి సాయి, పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధిగా పైడా వి.వి.రమణ (రాజా), వాలంటరీ కమిటీ వైస్ చైర్మన్ గా కంచర్ల నగేష్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కడంచర్ల శంకర్, పిఠాపురం నాయకులచే ముఖ్యమైన పదవుల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘ నాయకులు యావన్మంది హర్షం వ్యక్తం చేశారు.
