Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

పిఠాపురం : స్థానిక సూర్య గ్రంధాలయంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అనే బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు పెంచుటకు సమాజంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేయాలని, తద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ విద్య, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ పెరిగి పేద ప్రజల సంపాదనలో అధిక భాగం బడి ఫీజులు కట్టడానికి సరిపోతుందని, కావున ప్రభుత్వ విద్య కాపాడుకోవడం ద్వారా ప్రజలపై ఆర్థికభారం తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పిఠాపురం మండల అధ్యక్షుడు నరాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నారాయణ  మరొక ఉపాధ్యక్షుడు బి.సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షుడు వి.సత్యనారాయణ రెడ్డి, కార్యకర్తలు కే.విశ్వనాథం, మన ఊరు మన బాధ్యత అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, మధ్యపాన వ్యతిరేక కమిటీ సభ్యుడు నక్కా సూర్యనారాయణ, ఉపాధ్యాయులు ఎం.వి.వి.సత్యనారాయణ, ఏ.వి.రమణమూర్తి, ఎం.మాధవన్, జక్కతారావు, వి.పాములయ్య, శ్రీనివాస ఐటిఐ మాజీ పప్రిన్సిపాల్ బాలెం నూకరాజు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వజ్రకవచధర గోవింద గోవింద

Dr Suneelkumar Yandra

నిరంతరం ప్రజా సేవలో మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

TNR NEWS

భగవంతుడు ప్రసాదించిన మరో బాల్య దశ వృద్దాప్యం – పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాము – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra