Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

పిఠాపురం : నేడు జరగబోయే పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు నియోజకవర్గ పరిధిలో శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగానే స్థానిక రథాల పేట సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో ఇప్పటిదాకా మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి నేడు పవన్ కళ్యాణ్ రాకతో ఆయన చేతుల మీదుగా ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు కుట్టుమిషన్లు అందుకునే వారిలో ఉన్నట్టు, ఇప్పటికే వారి యొక్క పేర్లతో నమోదైన లిస్టు ప్రిపేర్ చేయడం జరిగిందని తెలిసింది. ప్రభుత్వ పథకాలు కేవలం ప్రభుత్వ అధికారుల లేక ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకే పరిమితమా అన్న ప్రశ్న పిఠాపురం నియోజకవర్గంలో చక్కర్లై కొడుతుంది. పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అన్న పవన్ వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే సొంతం కావడం హాస్యాస్పదం. దీనిపై ప్రత్యేక కమిటీని నియమించి అధికారులు సక్రమంగా పనిచేసి లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందే విధంగా కృషి చేయాలని నియోజకవర్గ శ్రేయోభిలాషులు అభిలాషిస్తున్నారు.

Related posts

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-

అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో అడ్డగోలు దోపిడి

Dr Suneelkumar Yandra

1008 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం

Dr Suneelkumar Yandra

తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్..!!

TNR NEWS

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

Dr Suneelkumar Yandra