- లోకేష్‌ని కలిసిన పి.వి.ఎస్.ఎన్.రాజు
చోడవరం : విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటి మరియు హెచ్‌ఆర్డి శాఖా మంత్రి నారా లోకేష్‌ని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్భంగా రాజు లోకేష్‌తో మాట్లాడుతూ చోడవరం నియోజవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని, అలాగే కూటమి ప్రభుత్వం తరపున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా మెరుగైన నైపుణ్యాలు యువతకు ఇప్పించి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు తీసుకురావలసిందిగా నారా లోకేష్‌ని అడగడం జరిగిందన్నారు. ఈ క్రమంలో రాబోయే కొద్ది రోజుల్లో ఒక భారీ జాబ్ మేళాను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని లోకేష్‌కి తెలియజేయడం జరిగిందని తెలిపారు.