చెస్ క్రీడలో ఆసియన్ ఛాంపియన్ గా ఎదిగి కోదాడ పట్టణ పేరును ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మేకల. అభినవ్ చిరస్మరణీయుడని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా అభినవ్ 35వ జయంతి సందర్భంగా దొంగరి. శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ చెస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో అభినవ్ మృతి చెందడం భారతదేశ క్రీడా రంగానికి తీరని లోటు అన్నారు. అభినవ్ పేరిట స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మేకల. అరుణ, వెంకటేశ్వర్లు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి. రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, మాజీ సర్పంచ్ పారా. సీతయ్య, ఎంఈఓ సలీం షరీఫ్, పైడిమర్రి సత్తిబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్,ఈదుల కృష్ణయ్య, బొలిశెట్టి. కృష్ణయ్య, షేక్ నయీమ్, కమదన చందర్రావు, పంది తిరపయ్య, నామ నరసింహారావు, హెచ్ఆర్ రాజేష్, సుందరి వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు,నాగమల్లేశ్వరి, రహీం, గంధం పాండు, బాజన్, ముస్తఫా, కర్ల సుందర్ బాబు, తదితరులు పాల్గొన్నారు………..