సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత సాధించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంతమొందించాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మి బడుగు బలహీన వర్గాల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు పూలే అని వారి సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గుండెల సూర్యనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు,పాలూరి సత్యనారాయణ, బాగ్దాద్,వీరారెడ్డి, అశోక్,ఆలేటి సత్యనారాయణ, నెమ్మది దేవమని, శంకర్,సంజీవ్,బాబా తదితరులు పాల్గొన్నారు…………