Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బివిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

అనేక రంగాలలో బివిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు బుర్ర ప్రమోద్ రెడ్డి జన్మదిన సందర్భంగా బివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ,సామాజిక రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బివిఆర్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, గునుకుల గోపాల్ రెడ్డి, బుర్ర పుల్లారెడ్డి, కొండపల్లి వాసు, డేగ కొండయ్య, బాబు నాయక్, బుర్ర నర్సింహారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, రాఘవరెడ్డి, బద్దం భద్రా రెడ్డి, నాగుల్ మీరా, దస్తగిరి, బివిఆర్ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు

TNR NEWS

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

TNR NEWS