అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి.గురూజీ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు పిల్లలు ఎక్కువ మంది లేరనే సాకుతో పక్కన ఉన్న వార్డ్ అంగన్వాడీ సెంటర్స్ ను క్లబ్ చేయడం వలన ప్రస్తుతం నడుస్తున్న సెంటర్స్ భవిష్యత్ లో దూరం అయిందనే సెంటర్ కు గర్భిణీ స్త్రీలు, భాలింత, పిల్లలు కూడ వచ్చే అవకాశం లేదని అన్నారు. సెంటర్ కిరాయిలు మిగులు కొరకు మాత్రమే ప్రభుత్వం క్లబ్ చేయాలనే నిబంధన తీసుకు రావడం సరైనది తక్షణమే క్లబ్ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీ టీచర్స్ కు పని భారం పెరిగిందని వేతనం మాత్రం గొర్రె తోక బెత్తడు అనే చందంగా ఉందని అన్నారు. ప్రతి పనిని ప్రతి సర్వే అంగన్వాడీ టీచర్స్ అప్పగించిన కారణంగా సెంటర్ లో టీచర్స్ లేక పోవడం వలన పిల్లలు రావడం కారణంగా భావిస్తున్నామని అన్నారు. గుజరాత్ హై కోర్ట్ ఇటీవల అంగన్వాడీలు ఫుల్ టైం పని చేస్తున్నందున రెగ్యులర్ చేసి వేతనం పెంచాలని ప్రభుత్వం ను అదేశించి విషయం అందరికి తెలుసని అన్నారు. వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ 24వేల రూపాయలు హెల్పర్స్ 21వేల రూపాయలు వేతనం పెంచాలని, అర్హులు అయిన వారికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రిటైర్ అయిన వారికీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 5వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంటర్స్ క్లబ్ వెంటనే ఆపకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం ఇంచార్జి సీడీపీఓ విజయ చంద్రిక కు మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సూర్యాపేట ప్రాజెక్టు అధ్యక్షురాలు, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి. సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు గుండగాని. సుజాత, చంద్రకళ, రేఖా,మాధవి, ఉష, సైదమ్మ, సునంద, భాగ్యలక్ష్మి, జానకమ్మ, జహంగీర్ బీ తదితరులు పాల్గొన్నారు.