శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శబరినగర్ లో అన్ని మాలధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న దానం కార్యక్రమాన్ని సూర్యాపేట డిఎస్పి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించే అయ్యప్ప స్వాములకు శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఎటువంటి దానం చేసినా పుణ్యం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త సేవాసమితి సభ్యులు యర్రంశెట్టి ఉపేందర్, వెంపటి పురుషోత్తం, అంతటి విజయ్, తోట నర్సయ్య, రాచకొండ కృష్ణ, గొట్టిపర్తి శ్రీకాంత్, ప్రకాష్, దేసోజు నాని తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
