Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని తెదేపా కోదాడ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర నాయకులు నాతాల రామిరెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు ఆధ్వర్యంలో బయ్యా నారాయణ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో తెదేపా బలంగా ఉందని తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టిడిపికే భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసే విధంగా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా వట్టికూటి సైదయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా ముండ్ర రవికుమార్, చల్లా బాబు, సహాయ కార్యదర్శిగా సంపేట బాలకృష్ణ, కార్యదర్శిగా గద్దే వెంకటేశ్వరరావు లను ఎన్నుకున్నారు.బయ్యా నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు, , కొల్లు నరసయ్య, గురవయ్య, శోభన్, చాపల శ్రీను, కోడె వాసు, నాగేశ్వరరావు, కోల్లు సత్యనారాయణ, కోదాటి గురవయ్య, సజ్జ రామ్మోహన్ రావు, చావా హరినాథ్, నెల్లూరు వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, థామస్ తదితరులు పాల్గొన్నారు………

Related posts

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

TNR NEWS

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Harish Hs

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్

TNR NEWS