Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

చదువుతోపాటు నైపుణ్యం అవసరం

విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ నందు కోదాడ, హుజూర్నగర్ రెండు డివిజన్ల పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలల సైన్సు మరియు గణిత ఉపాధ్యాయులు 36 మందికి రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా వారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి గుణాత్మక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో ల్యాబ్ ను ఏర్పాటు చేసింది అన్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ల్యాబ్ లు దోహదం చేస్తాయన్నారు.జిల్లా సైన్స్ అధికారి లామ్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్సు ఆసక్తిని పెంచి భావి భారత శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసిందన్నారు. రిసోర్స్ పర్సన్స్ కిషన్,ప్రశాంత్, రఘు లు రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ సైన్స్,గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు………

Related posts

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Harish Hs

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Harish Hs

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు

TNR NEWS

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS