వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి, నల్లబెల్లి మండల కన్వీనర్ చీకటి ప్రకాష్, విద్యా వంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్యలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంజాల రమేష్ మాట్లాడుతూ భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తారీఖున స్థాపించిన సిపిఐ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వం నిషేధానికి గురై ఆనాటి నాయకత్వాన్ని పది సంవత్సరాలు జైలులో నిర్బంధించినా, సంపూర్ణ స్వరాజ్యం కావాలని నినదించిన సిపిఐ,సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్రం సాధించడానికి ముందు 1946 నుంచి స్వాతంత్ర్యం తరువాత కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లు ,దేశ్ ముఖ్ లు, భూస్వాముల ,దొరల ఆగడాలను ఎదురించి దొరల గడీలను బ్రద్దలుగొట్టి తెలంగాణ ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచడమే కాకుండా ,భారత యూనియన్ లో నిజాం సంస్థానం విలీనం చేయక తప్పని పరిస్థితి కలిగేలా సిపిఐ నిర్వహించిన పోరాటాలే కారణమన్నారు . భూసంస్కరణలు చట్టం, కార్మికుల చట్టాలు,సాధించడమే కాకుండా,సకల రంగాలలోని వర్గాల హక్కుల కోసం పోరాడి అనేక హక్కులు సాధించి పెట్టింది పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీయే అన్నారు ,మొదటి యూపీఏ ప్రభుత్వానికీ మద్దతు ఇచ్చిన సిపిఐ సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ పార్టీల కృషి వల్లనే, ఉపాధి హామీ పథకం, సమాచారం హక్కు చట్టం,అటవీ హక్కుల చట్టం సాధించడం జరిగింది అన్నారు . ఈరోజు కూలీలకు కూలీ రేట్లు పెరుగుదలకు, ఉపాధి హామీ పథకం దోహదం చేసిందన్నారు,2005 వరకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికీ హక్కులు కల్పించింది కూడా లెఫ్ట్ ఫ్రంటే అన్నారు,నేడు దేశంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు పరోక్షంగా అమలు చేస్తున్నందున రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రైవేటీకరణతో కార్మికులు, ఉద్యోగాలు లేకా నిరుద్యోగం పెరుగుతుందన్నారు.వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సహాయం అందిస్తామంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధి హామీ పథకం కార్డు ఉండి పని చేసిన కార్మికులు అందరికీ ఇందిరమ్మ భరోసా కింద పన్నెండు వేలు ఇవ్వాలన్నారు, భూమి లేని వారికే ఆరువేల చొప్పున వేస్తామంటే, కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న గ్రాంట్స్ లెక్కలు బయట పెట్టి , కేంద్రం ఇస్తున్న డబ్బులకు లెక్క చెప్పాలన్నారు, లేకపోతే వ్యవసాయ కూలీలను కలుపుకొని వారితరఫున సిపిఐ పోరాడుతుందన్నారు.బీసీలకు కుల గణన ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీల వాటా కోసం కులజనగణన చేయాలనీ,అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్ బూస కుమారస్వామి కోల లింగయ్య తదితరులు పాల్గొన్నారు