Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దాని మూలంగానే రాజ్యాంగంలో దళితులకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని, దళితులు బలహీన వర్గాలు సీరియస్ గా ఆలోచించి ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బాంకెట్ హాల్ లో జరుగుతున్న కెవిపిఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులకు ఈరోజు ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దళితులు,బలహీన వర్గాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందు ఉంచడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. బీహార్ ఎన్నికలలో ఓటర్ల ప్రక్షాళన పేరుతో ఉన్న ఓట్లను తొలగించడం పేరుతోటి ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తుందని అన్నారు. బీహార్ ఎన్నికలలో ఓట్ల ప్రక్షాళన పేరుతో బిజెపి చేస్తున్న పరిణామాల పట్ల పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓటర్ల సవరణ పేరుతో ఆధార్ కార్డులను నిరాకరించి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు ఉన్న పట్టించుకోకుండా కుట్రలు చేసి అర్హులైన ఓట్లను తొలగిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగానే ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.ఇటీవల పహేల్గాం లో జరిగిన ఉగ్రదాడుల విషయంలో చేపట్టిన ఆపరేషన్ సింధుర్ లో జరిగిన విషయాలను దేశ ప్రజలకు ఎందుకు వివరించడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర పేరుతో హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు సృష్టిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోని ముఖ్యమైన సమస్యల పట్ల మోడీ ప్రభుత్వం సరిగా ఆలోచించడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసి కేంద్రానికి పంపిన పట్టించుకోవట్లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపి లెక్క చేశారని అందువల్ల మేము వాటిని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ లు తెలిపారని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ గణన చేపడతామని ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం దానిపట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వారిపై కపట ప్రేమను చూపుతుందని అన్నారు. అందుకోసమే రాబోయే రోజుల్లో రిజర్వేషన్ల పట్ల సమీక్ష చేయాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతుందని తెలిపారు. రిజర్వేషన్ల ఆధారంగా ఉన్న కొద్దిపాటి అవకాశాలను దెబ్బతీసి వారికి వచ్చే ఉద్యోగాలను రాకుండా చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగం ప్రైవేట్ పరం చేస్తూ ఆ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయలేమని పరోక్షంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దళితులకు అంబేద్కర్ అభయ హస్తం అమలు చేస్తామని, ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇస్తామని చెప్పి సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నందున కొన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని అన్నారు. నాలుగు లక్షల 50 వేల ఇండ్లకు శంకుస్థాపన చేశామని చెబుతున్న ప్రభుత్వం వాటి నిర్మాణానికి 22 వేల కోట్లు అవసరం ఉండగా కేవలం 8000 కోట్లు కేటాయించి ఏ రకంగా నిర్మాణలు చేపడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడం వాటిని అమలు చేయకుండా ఉండటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి ప్రమాదం తీవ్రంగా పెరుగుతుందని ప్రజల విషయాలను మతపరంగా చూస్తూ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తుందన్నారు బిజెపి అనుసరిస్తున్న విధానాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో బిజెపి ద్వారా ప్రజలకు కలగబోయే ప్రమాదం పట్ల ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాలు,అట్టడుగున ఉన్నటువంటి అంటరాని కులాల పేరుతో అణిచివేయబడుతున్న వారి రక్షణ కోసం కెవిపిఎస్ రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు నాగార్జున నందిపాటి మనోహర్ తిప్పారపు సురేష్ మంద సంపత్ బొట్ల శేఖర్ దుర్గం దినకర్ ప్రకాష్ శరత్ జిల్లా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మరి నాగేశ్వరరావు జిల్లా ఆఫీస్ బేరర్స్ టేకుల సుధాకర్,పిండిగ నాగమణి, నందిగామ సైదులు,దేవరకొండ యాదగిరి,దుర్గారావు,బొడ్డుపల్లి వెంకటరమణ,ఇరుగు రమణ, బొడ్డుపల్లి సురేష్ దొరపల్లి వెంకటేశ్వర్లు ప్రజాసంఘాల నాయకులు యాదగిరిరావు వేల్పుల వెంకన్న, నరసింహారావు వీరబోయిన రవి, నరసయ్య, జ్యోతి, కొప్పుల రజిత, నెమ్మాది మనోజ్, షేక్ జహంగీర్, సాయి రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

TNR NEWS

ఉద్యోగాల క్యాలెండర్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..! టీపీసీసీ అధికార ప్రతినిధి, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రావు

TNR NEWS

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

TNR NEWS

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS