కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులుకు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్ వరించింది. కాగా శనివారం హైదరాబాదులో జరిగిన త్యాగరాయ గాన సభ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గతంలో సూక్ష్మ కళారూపాలు 501 బియ్యపు గింజలపై ఎనిమిది భాషల జాతీయ గీతం రాయడం జరిగిందని 13 మిల్లిలా చెస్ బోర్డు విత్ కాయిన్స్ వంటి ఎన్నో కళారూపాలు తాను తయారు చేసినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమలపాకుల సైదులకు అవార్డు రావడం పట్ల పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు………