Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

 

TNR NEWS: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నారాయణపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మరికల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ సమక్షంలో మద్దూరు మండల పరిధిలోని పెదిరిపాడు గ్రామానికి చెందిన కళాకారుడు ఎస్.సంతోష్ ను సిపిఐ నారాయణ పేట జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంతోష్ పెదిరిపాడు గ్రామంలో దళిత సామాజిక పేద కుటుంబంలో జన్మించి విద్యార్థి దశనుండే అభ్యుదయ భావాలు కమ్యూనిజం సిద్ధాంతం అలవర్చుకొని విద్యా రంగ సంస్థలపై ఉద్యమిస్తూ పార్టీలో వివిధ హోదాల్లో అంచలంచెలుగా ఎదిగారు. చిన్నతనము నుండే ఆటపాటలపై ప్రత్యేక దృష్టి పెడుతూ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై సామాజిక అంశాలపై పాటలు పాడుతూ ప్రజల మన్ననలు పొందుతూ తెలంగాణ ప్రజానాట్యమండలి ఉమ్మడి జిల్లా నేతగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా అనేక ప్రాంతాలు తిరుగుతూ కళ ప్రదర్శనలు ఇచ్చారు. ఎస్.సంతోష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కావడం పట్ల సిపిఐ నాయకులు డి.చెన్నయ్య, ఎస్.వెంకటేష్, హనుమంతు, కనకప్ప, అంజి, రాములు వామపక్ష పార్టీల నాయకులు సామాజిక ఉద్యమ సంఘాల నేతలు తదితరులు అభినందనలు తెలిపారు.

Related posts

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

TNR NEWS

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS