మోతే:ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె. నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం, మోతే గ్రామాలలో జరిగిన ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూతక్కువ జీతాలు, అధిక పనిభారం మధ్య సేవలందిస్తున్న ఉపాధ్యాయుల గౌరవాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వ గుర్తింపు,అత్యవసరంహెల్త్ కార్డ్, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్, ఉపాధ్యాయుల వెల్ఫేర్ బోర్డు అవసరంఅని అన్నారు.ప్రభుత్వం ప్రవేట్ టీచర్ల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, దీంతో పాటు గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా,హెల్త్ కార్డుసంక్షేమ పథకాల్లో రిజర్వేషన్
తో పాటు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నికల సమయంలో ప్రైవేటు టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డిఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్కూల్ ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి, తక్షణమే న్యాయం చేయాలని కోరారు.ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు జాన్ మాస్టర్, జిల్లా కార్యదర్శి వీరయ్య, కాంపాటి ఉప్పలయ్య, చిరంజీవి, ఉపేందర్, స్వప్న, శ్రీలత, ప్రసన్న, గౌతమి, మౌనిక, శారద తదితరులు పాల్గొన్నారు.