ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, సహాయ కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాసరావు, కోశాధికారిగా సముద్రాల బద్రిష్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అభినందనలు తెలిపి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యులకు, గుమస్తాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యులు అందరూ కలిసి ఎటువంటి ఎన్నికలు లేకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
అనంతరం గుమస్తాల సంఘం కార్యవర్గానికి కూడా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా అనంతు సైదులు, ఉపాధ్యక్షులుగా వెంకట రాజారావు, ప్రధాన కార్యదర్శిగా వేమూరి నరసింహమూర్తి, సహాయ కార్యదర్శి పల్లా నాగరాజు, కోశాధికారిగా కొల్ల సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గట్ల కోటేశ్వరరావు సభా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పిన్నపురెడ్డి వీరారెడ్డి, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటేశ్వరరావు, వెంపటి మధుసూదన్, ఓరుగంటి పురుషోత్తం, చల్ల ప్రకాష్, పర్వతాలు,అలీ భాయ్, రఘు,సాయి, వీరయ్య, గరినే శ్రీధర్, తూనం కృష్ణ,రామినేని శ్రీనివాసరావు, యలమందల నరసయ్య, కనగాల నాగేశ్వరరావు, ఆవుల రామారావు, తోట శ్రీను,పైడిమర్రి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు……….