టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సేకరించేటప్పుడు మరియు రోడ్లపై ఆరబెట్టేటప్పుడు అదేవిధంగా ధాన్యాన్ని అమ్మకం కోసం కొనుగోలు కేంద్రాలకు లేదా రైస్ మిల్లులకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అనుకోని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని కావున రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు మరియు వివిధ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు, రైతులు తాము పండించిన ధాన్యాన్ని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లపైనే ఆరబెడుతూ మరియు ధాన్యం కాటాలు వేస్తూ, కాటాలు వేసిన ధాన్యం బస్తాలు రోడ్డుపై నిలువ చేస్తూ ధాన్యం రాశుల బస్తాల చుట్టూ రాళ్లు పెడుతూ ప్రతినిత్యం రోడ్డుపై వెళ్లే వాహనదారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని సందర్భాలలో రోడ్డుపై పెట్టిన రాళ్లు తీయకపోవడం ద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించి ప్రాణా నష్టం కూడా జరుగుతుందని వారు తెలిపారు, అదే విధంగా
రైతన్నలు వడ్లను పొలాల దగ్గర నుంచి మిల్లుకు ట్రాక్టర్ల మీద బోరేం లతో తీసుకు వెళుతున్న సమయంలో తమ ట్రాక్టర్లకు ఎక్కువ శబ్దం వచ్చేటట్లు పాటలు పెట్టుకుని వెళ్తున్నారు.దాని వలన వెనకనుంచి వచ్చే వాహనాల హారన్ శబ్దం వినపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని. కావున ధాన్యం సేకరణ మరియు ఆరబెట్టి నిల్వ చేయడం మార్కెట్ కు అమ్మకానికి తరలించే విషయంలో రైతులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరారు.