స్వామి వివేకానంద ఉత్సవ సమితి కన్వీనర్ మ్యాన మహేష్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో స్వామి వివేకానందుని విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,పాటు మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి తో కలిసి విగ్రహం ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తదాయకులు, మార్గదర్శకులు స్వామీ వివేకానంద అని ,వివేకానందుని జీవితం తాను సూచించిన మార్గం ప్రతిదీ దేశ సైతం కోసమేనని అన్నారు. స్వామి వివేకానంద బోధనలు నేటికీ యువతలో దేశభక్తిని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ఉంటాయని అన్నారు.
ప్రపంచ దేశాలు కూడా స్వామి వివేకానంద బోధనల పట్ల ఆకర్షితులయ్యారని అన్నారు. స్వామి వివేకానంద అంటే పేరు కాదని, ఈ దేశ ఆధ్యాత్మికత, యువతలోని ఆత్మస్థైర్యాన్ని వెలిగే తీసే ఒక మార్గం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,రాగిల్ల సత్యనారాయణ ,బోనగిరి దేవయ్య , అక్కినపెళ్ళీ కాశీనాదం, టీవీ సూర్యం,కౌన్సిలర్ లు చుక్క నవీన్ కుమార్ ,గుర్రం రాము ,రాజ్ కుమార్,నరేందర్ రావు,భూమన్న ,బిట్టు, ప్రభాకర్ రావు ,టాకూర్ కిషోర్ సింగ్,శంకర్ ,ఎడమల వెంకట్ రెడ్డి, కొక్కు గంగాధర్, కట్ట విజయ్,బొందుకురి శ్రీనివాస్, లక్ష్మినారాయణ ,భూమన్న ,బండారి మల్లికార్జున్ చిట్ల గంగాధర్ నరెందుల శ్రీనివాస్,బోమిది కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.