Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత

సన్న బియ్యం పంపిణీ,నూతన రేషన్ కార్డుల మంజూరు చేయటం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడం జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.

 

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా 

ర్ గారితో కలిసి మోతె మండల కేంద్రంలోని రైతువేదిక నందు శుక్రవారం మోతె మండలానికి చెందిన లబ్దిదారులకి నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది పర్వదినాన హుజూర్నగర్ పట్టణం నందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల కృషి తో పేదవారు కడుపునిండా అన్నం తినే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అలాగే ఇటీవల జూలై 14 న తిరుమలగిరి నందు రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ రెండు కార్యక్రమాలు మన జిల్లాలో జరగటం మన అదృష్టం అని తెలిపారు. మోతె మండలంలో ఈరోజు 277 మందికి నూతన రేషన్ కార్డులు, అలాగే 1091 కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడం జరిగిందని, ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు రానివారు కొత్త కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని తదుపరి అధికారులు అర్హత ఉంటే రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

 దశాబ్ద కాలం పాటు సామాన్యులకు అత్యవసరమైన ఇండ్లు, రేషన్ కార్డులు గత పాలకులు ఇవ్వలేదని మీరు నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ,ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు కడుపునిండా అన్నం తినానే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే నూతన రేషన్ కార్డులు,అదనపు కుటుంబ సభ్యుల నమోదు చేయడం జరుగుతుందని మీకు నూతన రేషన్ కార్డు ఇవ్వటం మా అదృష్టంగా భావించి మీ కుటుంబ సభ్యులకు అందరూ కడుపునిండా అన్నం తినే విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మోతే మండలంలో 28 షాపుల నందు 14497 కార్డులు ఉన్నాయని వీటిలో 42 వేల కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. మోతె మండలంలో ధరఖాస్తు చేసుకున్న 97% మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగిందని ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని తదుపరి అధికారులు పరిశీలించి అర్హత ఉంటే రేషన్ కార్డు మంజూరు చేస్తారని తెలిపారు. మీ అందరికీ ప్రభుత్వం తరఫున మంచి సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

 

 తదుపరి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

 

 ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవరావు, డిఎస్ఓ మోహన్ బాబు,తహసిల్దార్ వెంకన్న,ఎంపీడీవో ఆంజనేయులు, డి టి పుష్ప,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..!!* ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచనలో సర్కారు వరుసగా రెండు టర్మ్ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్ అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత! పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు

TNR NEWS

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు…….  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…….  కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్….

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS