Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 26 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 3కోట్ల 66 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ముగ్గురు స్టాప్ నర్సులతో కలిపి జాతీయ రాబిస్ కంట్రోల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టుకతో బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ రిహాబిటేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి,వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, కమదన చందర్ రావు, మధు, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మం, బాగ్దాద్, భాజాన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు………

Related posts

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు…….  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…….  కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్….

TNR NEWS

విద్యార్థులు సైబర్ నేరాల పైన అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS